పోలీసులపై వైసీపీ నాయకుల దాడి మాజీ పోలీసు అధికారిగా నాకు బాధ కలిగిస్తోంది: వర్ల రామయ్య - YCP leaders Attacks
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 12:34 PM IST
Varla Ramaiah Letter to DGP on YCP Leaders Attacks on Police: రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపైనే దాడికి పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (TDP politburo member Varla Ramaiah) డీజీపీకి లేఖ (Varla Ramaiah letter to DGP) రాశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారనే వార్త ఒక మాజీ పోలీసు అధికారిగా తనకు బాధకలిగిస్తోందని అన్నారు. పోలీసులపై దాడులు (YCP leaders Attacks on police) జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడులకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొడతారు జగన్ గద్దె దిగే సమయం ఆసన్నమైందని అన్నారు.