యువకుడిని చెట్టుకు కట్టి మెడలో చెప్పుల దండ.. గుండు కొట్టి చిత్రహింసలు - meerut villagers mob attack a man
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొందరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. గుండు కొట్టి, ముఖానికి నలుపు రంగు పూసి.. చేతులు కట్టి.. మెడలో చెప్పుల దండ వేశారు. అనంతరం అతడ్ని తీవ్రంగా కొట్టారు. దీంతో సోమవారం ఉదయం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మేరఠ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన బాధితుడు గత కొంతకాలంగా బ్రహ్మణపురిలోని తన బావ ఇంట్లో ఉంటున్నాడు. జీవనోపాధి కోసం అని అదే ప్రాంతంలో షూ పాలిషర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పొరుగునే ఉన్న రవి, సోను, అజయ్ అనే వ్యక్తులకు, బాధితుడి సోదరికి కొన్ని రోజుల కిత్రం విభేదాలు తలెత్తాయి. దీంతో వారు బాధితుడి ఇంటికి చేరుకుని అతడి సోదరితో గొడవపడడం ప్రారంభించారు. ఇదే సమయంలో బాధితుడు తన సోదరిని రక్షించడం కోసం అని వారి విషయంలో జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన నిందితులు అతడ్ని బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం అతడి చేతులను తాడుతో ఓ చెట్టుకు కట్టి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా ప్రవర్తించారు. నిందితులు అతడ్ని పట్టుకుని కొట్టి, ముఖానికి నల్ల రంగు పూసి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేశారు. దాడి చేసిన వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.