వైఎస్సార్ జిల్లాలో బైక్​ను ఢీ కొట్టిన లారీ - ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం - తెల్లవారుజామున లారీ బైక్​ను ఢీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:22 PM IST

Two Persons Died in Road Accident in YSR Dist: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లె వద్ద తెల్లవారుజామున లారీ బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 

మృతులు ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన జంగి మహేశ్ (31) , చిన్న యోహన్ (29)  గా గుర్తించారు. వీరు కొన్ని సంవత్సరాల క్రితం బేల్దారి పని కోసం వచ్చి నల్లలింగాయపల్లెలో నివాసం ఉంటున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు కమలాపురం ఎస్సై హృషికేశవ రెడ్డి తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.