రెండు పెళ్లి బస్సులు ఢీ - ఒకరు మృతి, 15 మందికి గాయాలు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 5:13 PM IST
Two Marriage Buses Collided in YSR District and one Person Died: వారంతా ఎంతో ఆనందంగా బంధుమిత్రులతో కలిసి పెళ్లికి వెళ్తున్నారు. ఇంతలోనే ఓ పెను విషాదం జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం వద్ద రెండు పెళ్లి బస్సులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కొండాపురం మండలం ముచ్చుమర్రి గ్రామంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వేంపల్లి వద్ద ఓ ఆలయంలో పెళ్లి వేడుకకు రెండు బస్సులు బయలుదేరాయి. చింతకుంట వద్ద ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా వేగం తగ్గడంతో వెనుక వస్తున్న మరో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముచ్చుమర్రి గ్రామానికి చెందిన నాగ సుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులను జమ్మలమడుగు, కొండాపురం ఆసుపత్రులకు తరలించారు.