ధాన్యం రవాణా బిల్లులేవీ? - బకాయి చెల్లించాలని ట్రాక్టర్ల యజమానుల ఆందోళన - Gannavaram tractor owners about pending bills

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 12:14 PM IST

Tractor Owners Worried about Transportation Charges :గత ఏడాది రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు రవాణా చేసిన ఛార్జీలు ఇంతవరకు చెల్లించకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరు మంగళవారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో సమావేశమయ్యారు. తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తేనే ఈ ఖరీఫ్‌కు సంబంధించిన ధాన్యం మిల్లులకు తరలిస్తామని ట్రాక్టర్ల యజమానులు వెల్లడించారు.  

Officials Delay in Releasing Pending Bills  in Gannavaram:గత ఏడాది రబీ సీజన్​లో ధాన్యాన్ని ట్రాక్టర్ ద్వారా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించమని వ్యవసాయశాఖ అధికారులు ఆదేశించారని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. వీరి ఆదేశాల మేరకు ట్రాక్టర్లు , ఇతర వాహనాల ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు చేర్చామన్నారు. ఇప్పటి వరకూ రవాణాకి సంబందించిన సొమ్ము  జమ కాలేదని ట్రాక్టర్ యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి తమ మండలం మెుత్తానికి రూ.20 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు.పక్క మండలాలైన రాజోలు,కొత్తపేట,రావులపాలెం ట్రాక్టర్ యజమానులకు  సొమ్ము జమ అయింది కాని గన్నవరం మండలానికి మాత్రమే డబ్బులు విడుదల కాలేదని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ఛార్జీలు చెల్సిస్తేనే ఈ ఖరీఫ్​లో ధాన్యాన్ని మిల్లులకు చేరుస్తామని అధికారులుకు స్పష్టం చేశామని ట్రాక్టరు యజమానులు వెల్లడించారు.పెండింగ్ ఛార్జీలుపై ఆధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని ట్రాక్టర్ యజమానులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.