Judges Were Transferred and Postings by AP High Court : కడప పీడీజేగా శ్రీదేవి నియామకం..పలువురు జడ్జిలు బదిలీ.. పోస్టింగులు - ap news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 10:50 AM IST

The High Court issued orders for promotions and transfers of some judges  అనంతపురం ఫ్యామిలి కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న జి.శ్రీదేవికి కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా పదోన్నతి కల్పిస్తూ (Sridevi Appointment as Kadapa PDJ) .. హైకోర్టు రిజిస్ట్రార్‌ విజిలెన్స్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాక పలువురు న్యాయాధికారులకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారికి కొత్త స్థానాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. మరికొందర్ని మరో స్థానానికి బదిలీ చేశారు. ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీలో సీనియర్‌ ఫ్యాకల్టీ సభ్యులు-1గా పని చేస్తున్న జి.చక్రపాణిని అక్కడే అదనపు డైరెక్టర్‌గా (Chakrapani as Additional Director of Judicial Academy) నియమించారు. ఇప్పటి వరకు చక్రపాణి పని చేసిన స్థానంలో సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌-2గా పని చేస్తున్న ఆర్‌.శ్రీలతను నియమించారు. విజయవాడ చీఫ్‌ మోట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న వై.శ్రీనివాస రావును.. జ్యుడీషియల్‌ అకాడమీ సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌-2గా నియమించారు. మరో వైపు మరికొంత మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్‌ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.