The Girl Suicide Note Brought Tears: "అమ్మా! నేను ఎందుకు చనిపోతున్నానో తెలియదు".. కంటతడి పెట్టిస్తున్న బాలిక సూసైడ్ నోట్ - సూసైడ్ నోట్ రాసి బాలిక ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 10:04 PM IST
|Updated : Sep 27, 2023, 10:44 PM IST
The Girl Suicide Note Brought Tears శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలిక ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలచివేసేలా చేసింది. తల్లిదండ్రులు నిత్యం గొడవపడటంతో తీవ్రంగా కలత చెందిన ఆ లేత మనస్సు. తాను ఏం చేస్తుందో.. దాని పర్యవసానం ఏంటో అర్ధం కాని ఆ పసి మనస్సు.. చివరకు తనవు చాలించింది. "అమ్మా నేను ఎందుకు చనిపోతున్నానో తెలియకుండానే చనిపోతున్నాను. నాన్న దయచేసి మద్యం తాగడం మానేయ్" అని లేఖలో రాసి తనువు చాలించింది ఆ బాలిక. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక కిరణ్మయి వీధిలో బమ్మిడి శ్రీను, లక్ష్మీల కుమార్తె శ్రావణి(16) నివాసం ఉంటున్నారు. ఆ బాలిక తల్లిదండ్రులు తరచూ తగాదా పడుతుండేవారు. వారికి నచ్చచెప్పలేని బాలిక మనస్థాపం చెందింది. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి.. ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన తల్లిదండ్రులు తరచూ తగాదా పడుతున్నారని ఆవేదన చెందుతూ తన మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ లేఖలో రాసినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ వార్త విన్న స్థానికుల కన్నీరు పెట్టుకున్నారు.
"అమ్మా.. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా నేను ఎందుకు చనిపోతున్నానో తెలియకుండానే చనిపోతున్నాను. నాన్న.. నువ్వు కలసి సంతోషంగా ఉంటే చూడాలనేది నా కోరిక. అది తీరకుండానే చనిపోతున్నాను. నా కోసం బాధ పడకండీ.. నాన్న దయచేసి మద్యం తాగడం మానేయ్.. ఐ మిస్ యూ అమ్మా, నాన్న, అన్నయ్య.." అని బాలిక సూసైడ్ నోట్ రాసి ఉంది.