ETV Bharat / state

అమరావతికి బిట్స్‌ - ఆలయం నమూనాలో భవనాలు - BITS IN AMARAVATI

రాజధాని అమరావతికి వరుసకడుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలు - బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ ఏర్పాటుకు చర్యలు

Bits in Amaravati
Bits in Amaravati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 9:17 AM IST

BITS Campus in Amaravati : రాజధాని అమరావతి పనులు చకాచకా జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రతిష్ఠాత్మక సంస్థలు వరుస కడుతున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (BITS) క్యాంపస్‌ ఏర్పాటుకు సీఆర్​డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్‌ కోరింది. తమ సంస్థ భవనాలనూ దేవాలయం నమూనాలో నిర్మిస్తామని ప్రతిపాదించింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.

రాజధాని అమరావతిలో ఎస్​ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్‌కి స్థలం ఇవ్వాలని సీఆర్​డీఏ భావించింది. అక్కడైతే 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే కావాలని బిట్స్‌ కోరడంతో అక్కడైతే 35 ఎకరాలే ఇవ్వగలమని స్పష్టం చేసింది. ఎక్స్ఎల్ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థకు ఐనవోలు వద్ద 2014-19లోనే సీఆర్‌డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడూ అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది.

2014-2019 మధ్యలో రాజధానిలో దాదాపు 135 సంస్థలకు సీఆర్​డీఏ స్థలాలు కేటాయించింది. వాటిలో పలు కేంద్ర సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. అప్పట్లో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలన్న ఒప్పందం మేరకు స్థలాలు కేటాయించారు. గడువు ముగియడంతో ఆ కేటాయింపులన్నీ సాంకేతికంగా రద్దయ్యాయి. వాటిని పునరుద్ధరించే క్రమంలో మార్పులు చేయనున్నారు. గతంలో కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాలు కేటాయించగా, ఇప్పుడు వాటన్నింటినీ ఒకే భవనంలో ఏర్పాటుచేసేలా ప్రతిపాదిస్తున్నారు.

ఒకే ప్రాంగణంలో కేంద్ర కార్యాలయాలు : సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కి అప్పట్లో 28 ఎకరాలు కేటాయించారు. అవసరమైతే దాన్ని కొంచెం పెంచి సీపీడబ్ల్యూడీ ద్వారా భారీ కాంప్లెక్స్‌ నిర్మించి కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్ని దానిలోనే ఏర్పాటు చేసేలా చూడాలని సీఆర్​డీఏ భావిస్తోంది. కేంద్రప్రభుత్వరంగ సంస్థలనూ వీలైనంత వరకు ఒకే భవనంలోకి తీసుకొచ్చేలా, నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ద్వారా భవనం నిర్మించేలా ప్రతిపాదిస్తోంది.

Amaravati Construction Works Updates : బ్యాంకులకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాల్ని రద్దు చేసి వాటి కార్యాలయాలనూ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. సెంట్రల్‌ లైబ్రరీ, స్టేట్‌ మ్యూజియం, ల్యాబ్‌లకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించనున్నారు.

రాజధానిలో 2014-2019 మధ్య స్థలాలు తీసుకున్న కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు ఐదేళ్ల జగన్‌ పాలనలో మిన్నకుండిపోయాయి. ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా పట్టాలెక్కుతున్ననందున స్థలాలిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తామంటూ ఆ సంస్థలన్నీ చెబుతున్నాయి. కానీ ఏపీ సర్కార్ గతంలో చేసిన కేటాయింపులన్నిటినీ సమీక్షించాలని నిర్ణయించింది. దానికోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.

అమరావతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం - జనవరి నుంచి పనులు ప్రారంభం

ఇక జెట్ స్పీడ్​లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.