Tension in Nandyala Officials Attempt to Remove Huts: నంద్యాలలో ఉద్రిక్తత.. గుడిసెలు తొలగించిన అధికారులు.. అడ్డుకున్న స్థానికులు - YCP leaders Irregularities
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/640-480-19652806-thumbnail-16x9-tension-in-nandyala.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 11:37 AM IST
Tension in Nandyala Officials Attempt to Remove Huts : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమాయకులపై దౌర్జన్యాలు, దారుణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. పేదలకు ఉండటానికి కనీసం ఇళ్లు కూడా లేకుండా కూల్చేస్తున్నారు. తాజాగా నంద్యాల్లో పేదల గుడిసెల తొలగింపు పక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బొమ్మలసత్రం - నూనెపల్లె రహదారికి ఇరువైపులా ఉన్న గుడిసెలు, దుకాణాలు తొలగిస్తామని అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం పోలీసులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా తొలగిస్తారంటూ బాధితులు వారిని ప్రశ్నించారు. దుకాణాలు, గుడిసెలు తొలగించేందుకు ససేమిరా అన్నారు. ప్రొక్లెయిన్‌కు అడ్డుపడ్డారు. అక్కడికి చేరుకున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి... బాధితులకు అండగా నిలిచారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదం జరిగింది. భూమా బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.