Telugu Woman Kilaru Indu Got World Bank Job: ప్రపంచ బ్యాంక్‌లో తెలుగమ్మాయి కిలారు ఇందు.. తన లక్ష్యం ఏమిటంటే..! - telugu woman kilaru indu got world bank job
🎬 Watch Now: Feature Video
Telugu Woman Kilaru Indu Got World Bank Job: ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనుకుంటారు చాలా మంది. కానీ, ఆ యువతి మాత్రం ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించి శభాశ్ అనిపించుకుంది. తనే కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన కిలారు ఇందు. అందరిలాగే పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇందు.. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్లో ఎంఎస్‌లో పబ్లిక్ పాలసీ కోర్సు చేసింది. తన లక్ష్యంలో భాగంగా ప్రపంచబ్యాంకులో కొలువు సాధించింది. ఈ తెలుగమ్మాయి. ఈ క్రమంలో అనేక అడ్డంకులు ఎదురైనా.. మొక్కవోని దీక్షతో శ్రమించి ప్రపంచ బ్యాంకుని మెప్పించింది. ఇందు చదివింది ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ అయినా.. పర్యావరణ పరిరక్షణపై ఆమెకున్న ఆసక్తి.. తన జీవనగమనాన్నే మార్చేసింది. ఫలితంగా ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించడంతో పాటు.. దక్షిణాసియా విభాగ పర్యవేక్షకురాలిగా ఎంపికైంది. దీంతో భారత్, పాకిస్థాన్ వంటి దేశాలకు పర్యావరణ పరిరక్షణలో దిశానిర్దేశం చేయనుంది బెజవాడ యువతి కిలారి ఇందు. మరి, ఇంతటి సదవకాశాన్ని అందుకోవడానికి తను ఎలాంటి కృషి చేసింది.? భవిష్యత్ లక్ష్యం ఏంటి..? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రపంచ బ్యాంకులో తెలుగమ్మాయి ఇందును అడిగి తెలుసుకుందాం.