లండన్లో సంక్రాంతి సంబరాలు - ఆటపాటలు, భోగి మంటలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 10:55 PM IST
Telugu People Sankranthi Celebrations in London: విదేశాల్లో తెలుగు ప్రజలు వారం ముందు నుంచే సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నారు. లండన్లోని బ్రాక్నెల్ నగరంలోని "ది పార్క్స్ కమ్యూనిటీ" లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి ప్రాముఖ్యతను, తెలుగు సంప్రదాయాలను వివరిస్తూ రోజంతా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. చిన్నపిల్లలు శ్లోకాలు, భక్తి గీతాలతో అలరించారు. చిన్న పిల్లలకి భోగి పళ్లు పోశారు.
అంతే కాకుండా పిడకలతో భోగిమంటలు కూడా వేశారు. యూకేలో పిడకలు ఏమిటీ అనుకుంటున్నారా? అవునండీ నిజం. దగ్గరలో వున్న గోశాల నుంచి వారం రోజుల ముందు ఆవుపేడ తెచ్చి, పిడకలు చేసి, యూకేలో ఇప్పుడు చలికాలం కాబట్టి వాటిని హీటర్ మీద ఎండబెట్టి మరీ తయారు చేశారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో వంటకం తెచ్చి అంతా కలిసి బంతి భోజనాలు చేశారు. పిల్లలకు పెద్దలకు సరదాగా ఆటలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ పిల్లలతోపాటు పెద్దలు ఆటపాటలతో సరదాగా గడిపారు.