Teacher Harassment on Student : గణితం చెప్తానని గదిలోకి తీసుకెళ్లి.. ఐదో తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు - బాపట్ల తాజా నేర వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 2:34 PM IST
Harassment by the Teacher on Student In Bapatla : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినితో ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన బాపట్లలో జరిగింది. విద్యాబుద్దులు బోధించాల్సిందిపోయి వేధింపులకు గురిచేసిన పనికి బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు. చిన్నారిపై జరిగిన లైంగిక వేధింపులకు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.
Sexual Assault on Student in Bapatla : మల్లికార్జున బృందావన కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా రామచంద్రరావు పనిచేస్తున్నారు. అదే బడిలో చదువుతున్న విద్యార్థికి గణితం చెబుతానంటూ గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వెంటనే వారు రామచంద్రరావును నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు.