TDP Three Days Protests Against YSRCP Sand Robbery వైసీపీ నేతల ఇసుక దోపిడిపై నేటి నుంచి టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.. - YCP leaders Irregularities
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 11:23 AM IST
TDP Three Days Protests Against YSRCP Sand Robbery రాష్ట్రంలో ఇసుక అక్రమ దోపిడీపై తెలుగుదేశం పార్టీ నేటి నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో యధేచ్చగా జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుని వైసీపీ నాయకులు చేస్తున్న దోపిడీపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైసీపీ నాయకులు అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఇసుక రీచ్‌లను, అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపింగ్ యార్డుల వద్ద పార్టీ శ్రేణులు, ఆయా గ్రామస్థులతో కలిసి నిరసనలు చేపట్టనున్నారు. రెండవ రోజు(29వ తేదీ)న ఇసుక అక్రమ దోపిడికి సంబంధించిన వివరాలను సాక్షాదారాలతో ఎమ్మెర్వో, పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయనున్నారు. మూడవ రోజు(30వ తేదీ)న విజయవాడ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టనున్నారు. వైసీపీ చేస్తున్న ఇసుక దోపిడీ గురించి సేకరించిన ఆధారాలను డీఎంజీ డైరెక్టర్‌కు అందించి అధికార పార్టీ చేస్తున్న ఇసుక దోపిడీ అరికట్టాలని కోరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ 3 రోజుల కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని.. విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.