Anam Venkataramana on Anil: అబద్దాలతో ప్రమాణం చేసిన అనిల్​ను దేవుడు క్షమించాలి: ఆనం - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2023, 2:05 PM IST

TDP state spokesperson Anam Venkataramana Reddy's comments: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు, మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారని, కూల్ డ్రింక్ షాపు యజమాని పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయని ఆయన నెల్లూరులో ప్రశ్నించారు. చిరంజీవి, నాగరాజు, కూల్ డ్రింక్ యజమాని మీ మనుషులు కాదా అని నిలదీశారు. తప్పుడు ప్రమాణాలు చేసిన అనిల్​ను భగవంతుడు క్షమించాలంటూ ఆనం ప్రార్థించారు. 2017 ఆగస్టులో క్రికెట్ బెట్టింగ్​పై అనిల్​ను ఎందుకు విచారించారో చెప్పాలన్నారు. బెట్టింగ్​కు సంబంధం లేదని అంటున్న అనిల్.. ఇటీవల తన బాబాయ్ పాపం మోస్తున్నానని చెప్పారన్నారు. వాస్తవానికి బాబాయ్, అబ్బాయ్ కలిసే ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. బెట్టింగ్ మా బాబాయ్ పనేనని పోలీసు విచారణలో ఎందుకు చెప్పలేదన్నారు. అనిల్​కు ఇంటర్నేషనల్ నోటీసులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయట పెట్టాలన్నారు వైఎస్ అనిల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అనిల్ కమార్ యాదవ్ కలిసి పెరూలో అక్రమంగా బంగారం మైనింగ్ చేస్తున్నారని చెప్పారు. లోకేశ్​ను విమర్శించిన అనిల్​పై అనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిలే.. డబుల్ ఎర్రి పుష్పం అని దుయ్యబట్టారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ముదివర్తిపాళెం కాజ్ వే పనులకు ప్రసన్న వర్గీయులు దొంగ బ్యాంకు గ్యారంటీతో టెండర్లు వేసింది వాస్తవం కాదా అని ఆనం ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.