TDP Protest Against The Removal of Idols : 'మరుగుదొడ్ల పక్కన మహనీయుల విగ్రహాలు'.. మున్సిపాలిటీ నిర్వాకంపై టీడీపీ ఆందోళన - నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2023, 3:19 PM IST

TDP Protest Against The Removal of Idols in Nandigama : నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌కు తొత్తులాగా పురపాలక సంఘం కమిషనర్‌ జయరాం వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నందిగామలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం, పొట్టి శ్రీరాములు, భగత్‌సింగ్‌ వంటి మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆదేశాలతో కమిషనర్‌ అర్ధరాత్రి తొలగించారని విమర్శించారు. గాంధీసెంటర్‌లో విగ్రహాలను తొలగించటాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం వద్ద నుంచి గాంధీసెంటర్‌ వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దివంగత మాజీ సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. మహనీయుల విగ్రహాలను తొలగించిన అధికారులకు రాజశేఖరెడ్డి విగ్రహం ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కేవలం మహనీయుల విగ్రహాలు మాత్రమే ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్నాయని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చిన కమిషనర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్ల పక్కన జాతీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేసి ఘోరంగా అవమానించారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే తొలగించిన విగ్రహాలన్నింటికి సముచిత స్థానం ఇచ్చి తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ..  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు విగ్రహాల తొలగింపులో ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. కమిషనర్‌ అర్ధరాత్రి విగ్రహాలు తీసి మరుగుదొడ్ల పక్కన పెట్టించారని తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని కోరారు. అన్ని విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని కోరారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.