రైతులు కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు - బాపట్ల జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 3:20 PM IST

TDP MLA Yeluri Maha Padayatra in Bapatla : కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతన్నను కనీసం పలకరించే తీరిక కూడా అధికార పార్టీ నేతలకు లేదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొనసపూడి నుంచి ఏలూరి సాంబశివరావు మహాపాదయాత్ర చేపట్టారు. ఇంకొల్లు మండలం పావులూరు వరకు 20 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో అడుగడుగునా ఏలూరికి  హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Yeluri Fires on YCP Government : సీఎం జగన్​  వేలాది మంది పోలీసులను పెట్టుకొని పరదాల మాటున ఉండి పర్యటనలు నిర్వహిస్తున్నారని ఏలూరి మండిపడ్డారు. మళ్లీ పథకాల పేరుతో రైతులను మభ్యపెట్టే విధంగా ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా పట్టించుకోకపోవడం దురదుష్టకరమన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.