TDP MLA Chinarajappa on Chandrababu Health: చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్, సజ్జలదే బాధ్యత.. అంతా వారి డెరెక్షన్లోనే.. : చినరాజప్ప - TDPleaders comments onChandrababu health condition
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 5:46 PM IST
TDP MLA Chinarajappa on Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు, జైలు అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇది తమను ఎంతో ఆవేదనకు గురిచేస్తోందని మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు 4 నెలల క్రితం కంటి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని.. మరో కన్ను ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. తాజాగా రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును పరిశీలించిన వైద్యులు కూడా ఇదే నివేదిక ఇచ్చారని తెలిపారు.
వైద్యులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్థాయి అధికారులు, జైలు అధికారులు, స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చి కాటరాక్ట్ ఆపరేషన్ ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమని అన్నారు. రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం లోకేశ్ క్యాంపు కార్యాలయం వద్ద చినరాజప్ప మాట్లాడారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రభుత్వం తక్షణం అనుమతి ఇవ్వాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.