వైఎస్సార్సీపీకి దొంగఓట్ల నమోదుపై ఉన్న శ్రద్ధలో సగం కూడా ఉద్యోగ, ఉపాధి కల్పనపై లేదు: నాదెండ్ల బ్రహ్మం - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 3:20 PM IST
TDP Leaders Fire on CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకిచ్చిన ఉద్యోగాలపై బహిరంగ చర్చకు రాగలదా అని టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం సవాల్ విసిరారు. కోడి గుడ్ల మంత్రి, కోడి కత్తి సీఎం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పగలరా అని ఎద్దెవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు 10లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోపిడీ, దొంగ ఓట్ల నమోదుపై ఉన్న శ్రద్ధలో సగం కూడా ఉద్యోగ, ఉపాధి కల్పనపై లేదని విమర్శించారు.
మరోవైపు తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. పరదాల చాటున వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను పలకరించకుండానే వెళ్లిపోయారని విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతోపాటు రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆయన వైఎస్సార్సీపీ పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ - జనసేన పొత్తు అని తెలిపారు.