Boy Head Stuck in Grills At Yadadri Temple : క్యూలైన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేష్టలు చేయడం మామూలే. వారు చేసే అల్లరికి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమీ చేయలేక నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుంటారు. అందరిలో కొట్టలేరు, బెదిరించలేరు. వారు చేస్తుంది చూస్తూ ఉండటం తప్ప మరొకటి చేయలేరు. ప్రధానంగా ఆలయ క్యూలైన్‌లో నిల్చున్నప్పుడు పిల్లలు అక్కడ దగ్గర్లో ఏర్పాటు చేసి ఉన్న గ్రిల్స్‌తో ఆడుకోవడం, వాటిపై ఎక్కి నిల్చోవడం, అందులో నుంచి తల పెట్టడం లాంటివి చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే యాదగిరి గుట్టలో చోటుచేసుకుంది.
భక్తులు తెలిపిన వివరాల మేరకు, హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదాద్రికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం యాదగిరి గుట్ట పై రూ.150 టికెట్ ప్రవేశ దర్శన క్యూలైన్‌లో నిల్చున్నారు. అందులో ఓ బాలుడు కూడా వెళ్లాడు. ఎటూ రద్దీ ఉండటం వల్ల లైన్లో ఏర్పాటు చేసి ఉన్న గ్రిల్స్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ బాలుడి తల గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి భక్తులు తలను బయటికి తీయడానికి ప్రయత్నించారు. కాసేపటికి గ్రిల్ రాడ్లను పక్కకు జరిపి తలను తీశారు. పిల్లాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తాం : టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు తెలుసా? - Tirumala Srivari Brahmotsavam 2024