LIVE : ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2వ రోజు - ప్రత్యక్ష ప్రసారం - TELUGU WRITERS CONFERENCE DAY2 LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2024, 3:58 PM IST
|Updated : Dec 29, 2024, 5:01 PM IST
World Telugu Writers Conference 2nd Day LIVE : మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు రెండో రోజు శనివారం విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఈ సభలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత చేరువ చేయడానికి ఏం మార్పులు తేవాలనే లక్ష్యంతో మహాసభల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. 'రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏ మార్పు కోరుతున్నాం?' అనేది ప్రధాన అంశంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రెండో రోజు కొనసాగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నుంచి ప్రత్యక్ష ప్రసారం. మీ కోసం.
Last Updated : Dec 29, 2024, 5:01 PM IST