అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను మోసం చేసిన జగన్ - విజయనగరం ప్రధాన వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 5:37 PM IST

TDP leaders Allegations against Jagan Mohan Reddy: రాష్ట్రంలో నిరుద్యోగ యువతను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. తెలుగు యువత విజయనగరం పార్లమెంట్ విభాగం నిరసన చేపట్టారు.  విజయనగరం కోట కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో.. తెలుగు యువత విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు చైతన్య బాబు, తదితరులు ఈ నిరసనలలో పాల్గొన్నారు. తొలుత విజయనగరం కోట నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాం వద్ద నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా  చైతన్యబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరుగుతూ రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అధికారంలోకి రాగానే వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచినా కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నాలుగున్నర ఏళ్ళు గడిశాాయి. 10,146 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన వాటిని కూడా భర్తీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న వాటిని తరిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే యువత రోడ్డున పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా గంజాయి, డ్రగ్స్​ను విపరీతంగా పెంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.