TDP Leader Vijaykumar on CAG: స్కిల్, ఫైబర్ నెట్ కేసుల్లో ఏ ఆధారాలతో బాబును అరెస్టు చేశారు..? ఆ రెండు ప్రాజెక్టులపై 'కాగ్' నివేదికలేవీ..?
🎬 Watch Now: Feature Video
TDP Leader Nilayapalem Vijaykumar on CAG: స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్ సహా 44 కార్పొరేషన్ల అకౌంట్లు గత ఐదేళ్లుగా 'కాగ్'కు ఇవ్వలేదని.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి కార్పొరేషన్లలో భాగమైన స్కిల్, ఫైబర్‌నెట్‌లో ఏదో జరిగిపోయిందంటూ.. తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. దీనికి కారణాలేంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై లేదా..? అని ఆయన ప్రశ్నించారు.
Vijaykumar COmments: స్కిల్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లకు సంబంధించి.. నీలాయపాలెం విజయ్‌కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ''స్కిల్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లు 'కాగ్'కు ఐదేళ్లుగా అకౌంట్లు ఇవ్వలేదు. అకౌంట్లు ఇవ్వకుండా ఏ ఆధారాలతో అరెస్టులు చేస్తారు..?. 50కిపైగా కార్పొరేషన్లు కాగ్‌కు అకౌంట్లు ఇవ్వలేదు. ఏ వ్యాపారమైనా ఏడాదిలోగా ఆడిట్ చేయించి అకౌంట్లు ఇవ్వాలి. ప్రభుత్వ కార్పొరేషన్లు కూడా దానికి అతీతం కాదు కదా..?. స్కిల్ డెవలప్‌మెంట్ ఆడిటింగ్ చేసి జూన్ నాటికి నాలుగేళ్లయింది. ఆడిటింగ్ చేసి కాగ్‌కు ఇవ్వలేదా..?, ఆడిటింగ్ చేయించలేదా..?. రాష్ట్రంలో 118 ప్రభుత్వ కార్పొరేషన్లలో 97 పనిచేస్తున్నాయి. 44 కార్పొరేషన్లు ఏళ్లుగా కాగ్ ఆడిటింగ్‌కు ఇవ్వలేదు. 97 కార్పొరేషన్లకు సంబంధించి 282 నివేదికలు రావాల్సి ఉంది. కాగ్ చేసేది ఏమీ లేక వచ్చిన 54 కార్పొరేషన్ల విశ్లేషణ చేసింది. కార్పొరేషన్ల ద్వారా రుణాలు యథేచ్ఛగా తీసుకుంటున్నారు. ఆడిటింగ్ చేయించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.'' అని ఆయన అన్నారు.