Interview with TDP fan Koteswara Rao: టీడీపీ గెలుపుకోసం అందరూ చంద్రబాబు వెంట నడవాలి: కోటేశ్వరరావు - రాజమండ్రిలో మహానాడు
🎬 Watch Now: Feature Video

Interview with TDP Fan Koteswara Rao: మహానేత ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం తరలివచ్చారు. పార్టీ కార్యక్రమం ఏదైనా, ఎక్కడైనా.. ముందువరుసలో ఉండే కార్యకర్త కోటేశ్వరరావు... ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా పాటుపడే చంద్రబాబు నాయకత్వాన్ని గెలిపించుకుంటామని అంటున్నారు. అలాగే అతను మీడియాతో మాట్లాడుతూ.. 1981లో నిజాం కళాశాలలో, తిరుపతిలో జరిగిన మహానాడు మొదలుకొని ఇప్పటి 2023 రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వరకు అన్నింటికీ హాజరవటం తన అదృష్టం అని కోటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన అభిమానిగా తొమ్మిది మాసాలు తిరిగానని వెల్లడించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నటు వంటి మన నాయకుడు చంద్రబాబుతో పాటు ఇప్పటి వరకు రాష్ట్రమంతా దాదాపుగా 1,75000 కిలోమీటర్లు తిరిగినట్లు వివరించారు. అది చూసి ఎన్టీఆర్,చంద్రబాబులు పైలట్ గా తనకు గుర్తింపు ఇచ్చారని చెప్పారు. టీడీపీ పార్టీ ప్రజల పార్టి... ఎన్టీఆర్ హయాంలో పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందో ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూడా అంతటి ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. అలాగే టీడీపీ గెలుపుకోసం అందరూ చంద్రబాబు వెంట నడవాలని కోరారు.