ETV Bharat / bharat

'నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది- వారంలో నివేదిక ఇవ్వండి'- యోగి సర్కార్​కు NHRC నోటీసులు - NHRC NOTICE TO UP GOVERNMENT

ఉత్తర్​ప్రదేశ్​లో ఝాన్సీ మహారాణి మెడికల్​ కాలేజీ ఘటనను సమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్- వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

NHRC Notice To Uttar Pradesh Government
NHRC Notice To Uttar Pradesh Government (Associated Press, IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 8:31 AM IST

Updated : Nov 17, 2024, 8:36 AM IST

NHRC Notice To Uttar Pradesh Government : ఝాన్సీ జిల్లా మెడికల్​ కాలేజీ ఆస్పత్రిలో 10మంది చిన్నారులను బలిగొన్ని అగ్నిప్రమాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్​హెచ్​ఆర్​సీ) సుమోటోగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్న ఎన్​హెచ్​ఆర్​సీ, నిర్లక్ష్యం జరిగిందని సూచిస్తున్నాయని పేర్కొంది. బాధితులు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నందున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై వారంలో రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్​ఐఆర్ స్టేటస్​, బాధ్యులన అధికారులపై తీసుకున్న చర్యలు, క్షతగాత్రులకు అందుకున్న వైద్యం. బాధిత కుటంబాలకు ఇస్తున్న పరిహారం వివరాలు నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి టనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యల గురించి కూడా తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు కమిషన్ వెల్లడించింది.

నిజ నిర్ధరణ కమిటీ
ఈ ఘటనపై నిజనిర్ధరణకు ప్రభుత్వం నలుగురితో కూడిన కమిటీ వేసింది. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదికను ఏడురోజ్లులోగా ప్రభుత్వానికి కమిటీ అందించనుంది. చిన్నారుల మృతికి కారణం ఆసుపత్రిలో భద్రతా లోపాలేనని వస్తున్న ఆరోపణలను యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్‌ పతాక్‌ ఖండించారు. వైద్య కళాశాలలో అన్ని అగ్నిమాపక పరికరాలు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ జరిగిందన్న బ్రిజేష్‌ ఫిబ్రవరిలో మాక్‌ డ్రిల్‌ని కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలు పనిచేయట్లేదని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వైద్యకళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర సింగ్‌ తెలిపారు.

రాజకీయ దుమారం
ఝాన్సీ మెడికల్ కాలేజీ అగ్నిప్రమాదం రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని 9 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో- ఇది పాలనా యంత్రాంగ వైఫల్యమంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అగ్నిప్రమాదం అనంతరం ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ పర్యటనకు ఆసుపత్రి వర్గాలు చేసిన ఆర్భాటాలు రాజకీయ విమర్శలకు తావిచ్చాయి. రాత్రికి రాత్రి ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లిన వీడియోను 'ఎక్స్‌'లో పోస్టు చేసిన కాంగ్రెస్‌ పార్టీ- "10 మంది చిన్నారులు చనిపోయి బాధిత కుటుంబాలు గుండెలవిసేలా ఏడుస్తుంటే ఉపముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలుకుతున్నారు" అని ఘాటుగా విమర్శించింది.

మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చాటేలా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం వదిలి, రాష్ట్రంలో దారుణంగా ఉన్న ఆరోగ్య వసతులపై దృష్టి పెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. బాధితులను ఆదుకొని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్​పీ, ఆర్‌ఎల్​డీ కోరాయి.

Last Updated : Nov 17, 2024, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.