ETV Bharat / state

మేనమామ కాదు మానవ మృగం - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అత్యాచారం

Uncle Raped Minor Girl
Uncle Raped Minor Girl (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Uncle Raped Minor Girl : నేటి సమాజంలో ఆడవారిపై రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్లయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా అత్యాచారాలకు తెగబడుతున్నారు. మరికొందరు వావి-వరసలు మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. మహిళలు అర్ధరాత్రే కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా మేనమామాగా భావించిన దగ్గరి బంధువే మానవమృగమై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం మండలానికి చెందిన ఓ అమ్మాయి నిడదవోలు మండలంలోని ఓ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుంది. తండ్రి వేరుగా ఉంటున్నాడు.

బాలిక బాగోగులను తాడేపల్లిగూడెం మండలంలో ఉంటున్న అమ్మమ్మ చూస్తోంది. అమ్మాయికి వరుసకు మేనమామైన కమల్‌ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. బాలిక ఆధార్‌కార్డులో మార్పులు చేయాల్సి రావడంతో ఈ నెల 14న గురువారం ఆమె అమ్మమ్మ కమల్‌కు వంద రూపాయలు ఇచ్చి పంపించింది. అతడు వసతిగృహానికి చేరుకుని అమ్మాయిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చాగల్లు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అనంతరం అమ్మాయిని తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి వద్ద వదిలివేశాడు. బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో అమ్మమ్మ ఏం జరిగిందని ప్రశ్నించింది. ఈ క్రమంలో కమల్‌ చేసిన దురాఘతాన్ని వివరించింది. దీంతో బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారంతోపాటు అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.నరేంద్ర పేర్కొన్నారు.

మేన కోడలిపై అత్యాచారం - బిడ్డ పుట్టాక మొదలైన వేధింపులు

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.