TDP Protest: గ్రామ పంచాయితీ కార్యదర్శి తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళన - చిత్తూరు వార్తలు
🎬 Watch Now: Feature Video
TDP demand to suspend panchayat secretary : సత్యవేడు నియోజకవర్గం బీఎన్ కండ్రిగలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సుబ్బారావు తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇటీవల బాలకృష్ణ జన్మదినం సదర్భంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీని తొలగించాలంటూ గ్రామపంచాయితీ కార్యదర్శి టీడీపీ శ్రేణులకు సూచించారు. బీఎన్ కండ్రిగ మండల టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు స్ధానికంగా లేకపోవడంతో ఫ్లెక్సీ తొలగింపు ఆలస్యమైంది. దీంతో పంచాయితీ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత సుధాకర్ నాయుడుని దుర్బాషలాడటంతో పాటు భౌతికదాడికి దిగారు. ఫ్లెక్సీని తొలగిస్తామని చెప్పినా పంచాయితీ కార్యదర్శి.. సుధాకర్ నాయుడుపై దాడికి దిగడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖడించారు. పంచాయితీ కార్యదర్శి తీరును నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. అనుచితంగా ప్రవర్తించిన పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. రహదారిపై నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అక్కడినుంచి పంపించి వేశారు.