Tanuku Kanaka Durgamma Annapurna Devi Alankaram: గోస్తని తీరాన అన్నపూర్ణ అలంకారంలో దుర్గాదేవి.. పోటెత్తిన భక్తులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2023, 2:18 PM IST
Tanuku Kanaka Durgamma Annapurna Devi Alamkaram: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు తణుకు గోస్తని తీరాన వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులు విశేష పూజలు, కుంకుమార్చనలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. అమ్మవారు వామ హస్తంలో రసాన్న పాత్ర ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు.
అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే భవిష్యత్తులో అన్న పానాదులకు లోటుండదని భక్తులు విశ్వసిస్తారు. అక్షయపాత్ర ధరించిన అమ్మవారు అన్న ప్రసాదినిగా అనుగ్రహిస్తారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు.. అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.