Police Innovative Thinking On Prevent Road Accidents : ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణణీయంగా పెరుగుతోంది. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, ఎందరో జీవితాంతం వైకల్యంతో బతకాల్సి వస్తోంది. అతి వేగాన్ని అదుపు చేయలేక, సూచికల బోర్డులను పాటించక, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు బాపట్ల జిల్లా పోలీసులు ఓ ప్రణాళిక రూపొందించారు.
ఒంగోలు - కత్తిపూడి జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు వేటపాలెం పోలీసులు వినుత్నంగా ఆలోచించారు. వేటపాలెం నుంచి చీరాల మధ్యలో బైపాస్ రోడ్డు జంక్షన్లు వద్ద ఇసుక డ్రమ్ములను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ, వేటపాలెం బైపాస్ రోడ్డుపై ఈ మధ్యకాలంలో జరిగిన రోడ్డు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఇసుక డ్రమ్ములను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ ఆదేశాలతో ఇసుకతో నింపిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం సీఐ, సిబ్బంది పాల్గొన్నారు.
రూట్ మార్చిన పోలీసులు - పెద్దలు హెల్మెట్ పెట్టుకోవడం లేదని పిల్లలకు క్లాస్!
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!