Swaroopanandendra Swami Rishikesh Trip: చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్కు స్వరూపానందేంద్ర.. - విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి
🎬 Watch Now: Feature Video
Swaroopanandendra Swami Rishikesh Trip: చాతుర్మాస్య దీక్షలో పాల్గొనేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్ పయనమయ్యారు. బుధవారం విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన దిల్లీకి బయలుదేరారు. దిల్లీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేశ్కు వెళ్లనున్నారు. దాదాపు 115 రోజులపాటు ఆయన అక్కడే ఉండనున్నారు. స్వరూపానందేంద్ర స్వామి అక్టోబరు ఐదో తేదీ వరకు రిషికేశ్ వద్ద గంగాతీరంలో ఉన్న విశాఖ శారదాపీఠానికి చెందిన ఆశ్రమంలోనే ఉంటారు. రిషికేశ్‌లో ప్రతి సంవత్సరం చాతుర్మాస్య దీక్షను నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. రిషికేశ్ బయలుదేరే ముందు స్వరూపానందేంద్ర స్వామి పీఠం అధిష్టాన దైవమైన రాజశ్యామల అమ్మవారు, ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బయలుదేరే ముందు జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు స్వామికి గురువందనం సమర్పించగా ఆయన వారిని ఆశీర్వదించారు. ఆనంతరం భక్తులను కలిసిన స్వరూపానంద స్వామికి వారు వీడ్కోలు పలికారు.