Sunkara Rajendra Prasad on Chandrababu Naidu Bail: 'చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు' - సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 7:15 PM IST

Sunkara Rajendra Prasad About Chandrababu Naidu Bail: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఇదే అంశంపై సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్‌ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ... పాత నేరాలకు సంబంధించిన ఈ కేసులో సెక్షన్‌ 17ఏ వర్తించదని అన్నారు. అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే 17ఏ వర్తిస్తుందన్న రోహత్గీ... అవినీతిపరులకు ఇది రక్షణఛత్రం కాకూడదన్నారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారని వాదించారు. స్కిల్ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని... అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని రోహత్గీ చెప్పారు. అవినీతి నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టాలని.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేశారని రోహత్గీ పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదని... ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందన్నారు. వందల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు... సీఆర్పీసీ సెక్షన్‌ 482 కింద క్వాష్‌ చేయలేమన్నారు. 

చంద్రబాబు న్యాయవాది హరీష్‌ సాల్వే: చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే వర్చువల్‌గా  వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందునుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించారు. 2019 నాటి 'శాంతి కండక్టర్స్‌' కేసు, 1964 నాటి రతన్‌లాల్ కేసులను హరీష్‌ సాల్వే ప్రస్తావించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్షసాధింపులకు అవకాశం ఉంటుందని... రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17ఏ ఉందని పేర్కొన్నారు. 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని తెలిపారు.  ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదని.. మొదట్లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని.. రిమాండ్‌ సమయంలో చంద్రబాబు పేరు చేర్చారని  హరీష్‌ సాల్వే పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులోనైనా 17ఏ వర్తిస్తుందని.. 2016-17లో జరిపిన విచారణలో ఏమీ తేలలేదని పేర్కొన్నారు. 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.