ప్యాసింజర్ ఆటోలా రేషన్ సరఫరా వాహనం - ప్రమాదకర రీతిలో విద్యార్థుల ప్రయాణం - School Students Danger Journey in Rice Trali
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 8:56 PM IST
|Updated : Dec 5, 2023, 10:26 PM IST
Students Travelled in Ration Rice Supply Vehicle: ఇంటింటికి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే వాహనంలో పాఠశాల విద్యార్థులు ప్రమాదకర రీతిలో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వాహనంలో విద్యార్థులు ప్రయాణిస్తుండగా వాహన డోర్లు తెరిచి ఉంచడం మరింత వివాదస్పదంగా మారింది. విద్యార్థులు అలా ప్రయాణించడాన్ని చూసిన స్థానికులు ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నుంచి ఉస్తినిపల్లికి పాఠశాల విద్యార్థులను రేషన్ సరఫరా చేసే వాహనంలో తరలించారు. రేషన్‌కార్డు దారులకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం వాహనాలను కేటాయించింది. అయితే ఓ వ్యక్తి తనకల్లు మండలంలోని ఓ పాఠశాల ముగిసే సమయానికి అక్కడికి చేరుకుని పదుల సంఖ్యలో అందులో విద్యార్థులను ఎక్కించుకున్నాడు. వారి వద్ద నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేసి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న సమయంలో వాహనం డోర్లు ఒకవైపున ప్రమాదకర స్థితిలో తెరిచే ఉన్నాయి. విద్యార్థులు డోర్ల వద్ద నిల్చోని కేరింతలు కొడుతూ రోడ్డుపై వాహనదారులకు అభివాదాలు చేస్తున్నారు. దీనిని గమనించిన స్థానికులు విద్యార్థులు ప్రమాద బారిన పడితే పరిస్థితి ఎంటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.