Srisailam Project HighSchool Diamond Jubilee Celebrations: శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నతపాఠశాల పూర్వవిద్యార్థులకు అరుదైన ఘనత - Srisailam project
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-10-2023/640-480-19883623-thumbnail-16x9-srisailam-project.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 10:45 PM IST
Srisailam Project HighSchool Diamond Jubilee Celebrations శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు, ప్రాజెక్టు ఉన్నత పాఠశాల, ప్రజెక్టు వైద్యశాల నిర్మించి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా సీబీఐ మాజీ జెడి వివిఎస్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 6 వేల మంది పూర్వ విద్యార్థులు ప్రాజెక్టు పాఠశాల వద్ద స్పోసా గీతాన్ని ఆలపించారు. స్పోసా గీతానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కడంతో ఆనందం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులంతా యూనిఫామ్ ధరించి ఒకే వేదికపై గీతాలు చేయడం ప్రపంచ రికార్డుగా మారిందని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కొనియాడారు. 2009 సెప్టెంబర్ వరదల సమయంలో కృష్ణ తుంగభద్ర నదుల్లో విపరీతమైన వరదలు వచ్చాయన్నారు. ఆ వరదలకు శ్రీశైలం డ్యాం ఉంటుందా కొట్టుకుపోతుందా అన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి అన్నారు. కానీ ఆనాటి ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణానికి సిమెంటు ,ఇసుక, ఉక్కుతో పాటు తమ నిజాయితీని కలిపి కట్టడం వల్ల శ్రీశైలం డ్యాం భద్రంగా ఉందని కితాబిచ్చారు.