Janasena Fire on Bhanu Prakash: 'శ్రీవాణి ట్రస్టులో తప్పులు జరగలేదని భానుప్రకాష్ రెడ్డి ఎలా చెప్తారు..?' - జనసేన నేత కిరణ్ రాయల్
🎬 Watch Now: Feature Video
Janasena Fire on Bhanu Prakash: శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంటే.. మిత్రపక్షం నేత భాను ప్రకాష్ రెడ్డి ట్రస్టులో ఎటువంటి తప్పులు జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జనసేన తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ట్రస్టులో ఏ తప్పులు జరగలేదని చెప్పడానికి ఏ అధికారం ఉందంటూ నిలదీశారు. తిరుమలపై భాను ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. లేదా పార్టీ అభిప్రాయమో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు. ట్రస్ట్ లెక్కలు అడిగిన జనసేనకు వివరణ ఇవ్వకుండా.. భాను ప్రకాష్ రెడ్డికి అకౌంట్స్ చూపించడం ఏమిటని ప్రశ్నించారు. భాను ప్రకాష్ రెడ్డి మిత్రపక్షమా లేక అధికార పక్షమా అని నిలదీశారు. భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించినట్టు ఉందన్నారు. వెంటనే భానుప్రకాష్ రెడ్డిని బీజేపీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తితిదే యాజమాన్యం.. భాను ప్రకాష్ రెడ్డికి శ్రీవాణి ట్రస్ట్ లెక్కలను చూపించారని మీడియాకు తెలపడాన్ని తప్పు పట్టారు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌లు శ్రీవాణి ట్రస్ట్‌లో అవకతవకలు జరుగుతున్నాయని బహిరంగంగా ప్రశ్నిస్తే.. వారికి అవగాహన లేదని మాట్లాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.