Skill Development Beneficiary on CBN Arrest: చంద్రబాబు వల్లే నాకు రూ.14 లక్షల జీతం..! సత్యసాయి జిల్లా యువకుని ఆవేదన.. - స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/640-480-19559334-thumbnail-16x9-skill-development-beneficiary-on-cbn-arrest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 3:16 PM IST
Skill Development Beneficiary on CBN Arrest: స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయగా .. అది విష ప్రచారమంటూ ఇప్పటికే చాలా మంది ఆ విషయాన్ని ఖండిచారు. నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ తీసుకొని అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందిన యువత చంద్రబాబుకు మద్దతుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకొని అధిక వేతనంతో ఉద్యోగం పొందానని.. సత్యసాయి జిల్లాకు చెందిన మాధవ నాయుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను పెట్టి లక్షలాది మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటులో అక్రమాలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టించిదని మాధవ అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందటంవల్లనే రూ.14 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించినట్లు మాధవ నాయుడు తెలిపారు.