Secretariat Building Locked for Non Payment of Rent: మూడెళ్లుగా చెల్లించని అద్దె.. సచివాలయానికి తాళం వేసిన యజమాని - Secretariat in a rented building in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 4:14 PM IST
Secretariat Building Locked for Non Payment of Rent: అద్దె చెల్లించలేదని సచివాలయానికి భవన యజమాని తాళం వేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొనకనమిట్ల గ్రామంలో సచివాలయం ప్రారంభం నుంచి ఇక్కడ అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే మూడేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవనం యజమాని తిరుపతిరెడ్డి పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఫలితం లేకపోవడంతో.. చేసేదేమీ లేక భననానికి తాళం వేశాడు. ఎప్పటిలాగే సిబ్బంది యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లగా అక్కడ సచివాలయ భవనానికి తాళం వేసి ఉంది.. దీంతో సిబ్బందికి ఏమి చేయాలో అర్థంకాక బయట కూర్చున్నారు. కొంతసేపు తర్వాత సిబ్బంది అంతా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు.
మూడేళ్లు అద్దె ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని యజమాని తెలిపాడు. నెలకు రూ. 9 వేల చొప్పున అద్దెకు ఇస్తే.. అదిగో ఇదిగో అని సాకులు చెబుతున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో అద్దె చెల్లించేందుకు చర్యలు తీసుకునేలా చూస్తానని ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం యజమాని తిరుపతిరెడ్డి తాళాలు తీశారు.