ETV Bharat / state

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ విజయసాయిరెడ్డి! - VIJAYASAI REDDY QUITS POLITICS

అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్‌కు అన్నీ తానైన విజయసాయిరెడ్డి - వైఎస్‌ కుటుంబంలో మూడు తరాలతో ఆర్థిక అక్రమ బంధం

Vijayasai Reddy Irregularities
Vijayasai Reddy Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 10:55 AM IST

Vijayasai Reddy Quits Politics : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆది నుంచి అరాచకమే. ఆడిటర్‌గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి తర్వాత రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారు. వైఎస్‌ కుటుంబం అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్‌గా దన్నుగా నిలిచారు. రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు రప్పించడంలో, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడంలో కీలకభూమిక పోషించిన ఘనాపాఠి. వైఎస్‌ రాజారెడ్డి, తర్వాత రాజశేఖర్​రెడ్డి, ఆపైన జగన్‌. ఇలా వైఎస్‌ కుటుంబంలో మూడు తరాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది.

వైఎస్‌ జగన్‌ మోహన్​రెడ్డి అక్రమాస్తుల కేసులో సూత్రధారి, కీలకపాత్రధారి విజయసాయిరెడ్డి. సూట్‌కేస్‌ కంపెనీల ఏర్పాటులో, వాటి ద్వారా నిధులు మళ్లించడంలో, జగతి పబ్లికేషన్‌ విలువను అమాంతం పెంచుతూ డెలాయిట్‌ నుంచి తప్పుడు నివేదికలు తీసుకువచ్చి, ఆ సంస్థ షేర్‌ విలువను భారీగా పెంచి జగన్‌కు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వారితో జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల అక్రమాల్లో జగన్‌ ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటే ఏడాదిపైగా జైలులో గడిపారు.

పాపాల్లో పాలు - అందుకే పదవులు : అక్రమాస్తుల వ్యవహారంలో తనకు పూర్తిస్థాయిలో సహకరించినందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్‌ విజయసాయిరెడ్డికి 2016లో వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభకు పంపారు. ఆ పార్టీ ఏర్పాటయ్యాక వచ్చిన తొలి రాజ్యసభ స్థానమది. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా అవకాశం కల్పించడంతో ఆయన ఆ హోదాలో కేంద్రంలో విస్తృతంగా లాబీయింగ్‌ చేసి జగన్‌కు వ్యక్తిగతంగా, రాజకీయంగా మద్దతు కూడగట్టారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో దాదాపు 12 ఏళ్ల నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇక్కడ గమనార్హం. 2022లో రెండోసారి కూడా రాజ్యసభ అవకాశమిచ్చారు. 2028 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు పదవీకాలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

సీబీఐ, ఈడీలు జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని ఎ-2గా చేర్చాయి. అప్పటి నుంచి ఆయన ఎ-2గా పేరొందారు. వైఎస్సార్సీపీలో జగన్‌ తర్వాత దాదాపు నంబర్‌-2గా వ్యవహరించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఆయన విశాఖ కేంద్రంగా సాగించిన ఆ రాజకీయం వేరే లెవెల్‌. ఆ ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిననే స్థాయిలో అప్పట్లో రెచ్చిపోయారు.

విజయసాయిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు ఆయనకు, జగన్‌కు మధ్య అంతరం వచ్చిందనే ప్రచారం వైఎస్సార్సీపీలో జరిగింది. అప్పట్లో కొద్దికాలం ఆయన పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనకు దక్షిణ కోస్తా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. గత సంవత్సరం సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి కూడా దించారు. దీంతో జగన్, విజయసాయిల బంధం విడదీయరానిదంటూ పార్టీ నేతలు మాట్లాడుకునేవారు.

అవకతవకలపై ప్రభుత్వం దృష్టి : రాజకీయంగా విమర్శలు చేయడంలో విజయసాయిరెడ్డి నీచస్థాయికి దిగజారిన ఘటనలు అనేకం. ప్రత్యర్థి పార్టీ నేతలను సామాజిక మాధ్యమాల్లో కించపరుస్తూ, వారి వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టేవారు. ప్రశ్నించివారిపై అసభ్యపదజాలంతో విరుచుకుపడటం, కోర్టుకు ఈడుస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆయన నైజం. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే పాత అవకతవకలన్నీ తిరగదోడుతోంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టు, సెజ్‌ల బలవంతపు బదలాయింపు వ్యవహారంపై కేసు నమోదైంది. ఎటూ తప్పించుకోలేమన్న ఉద్దేశంతో వాటిలో షేర్లను తిరిగి బదలాయించేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ ప్రక్రియ సగం పూర్తయింది. విశాఖలో జరిగిన అన్ని రకాల అవకతవకలపై కూడా సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణరావు, బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మస్తాన్‌రావు టీడీపీ, కృష్ణయ్య బీజేపీలో చేరి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఆ పార్టీని కుదిపేసింది. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌ నెలాఖరుకు తిరిగి రానున్నారు. ఈ సమయంలో కీలక నేత విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా ప్రకటన వైఎస్సార్సీపీలో తీవ్ర దుమారం రేపింది.

Janasena Corporator Murthy Yadav on MP Vijayasai Reddy: 'కుమార్తె కోసం.. రూ. 100 కోట్ల విలువైన స్థలంలో విజయసాయి రెడ్డి విల్లా'

MP Vijayasai Reddy:ఆ ఆస్తులతో.. విజయసాయి రెడ్డికి సంబంధం లేదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.