విద్యార్థినిపై స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు - టాయిలెట్​లోకి వెళ్లి మరీ అసభ్య ప్రవర్తన - విద్యార్థినిపై స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 10:52 AM IST

School Teacher Harassment on Student: విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడయ్యాడు. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న సుందరబాబు.. మరుగుదొడ్డిలోకి వెళ్లిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా(Teacher Sexual Harassment to Student in Toilet) ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి.. తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని వివరించింది. 

Sexual Harassment on Student: దీంతో వెంటనే తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి పాఠశాలకు వెళ్లి ఆ టీచర్​కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు అధికారుల వాహనాన్ని గ్రామస్థులు కొద్దిసేపు అడ్డుకున్నారు. ఈ సమాచారం జిల్లా విద్యాధికారి(District Education Officer) దృష్టికి తీసుకెళ్లడంతో సుందరబాబుని సస్పెండ్(Teacher Sundara Babu Suspended) చేశారు. పోలీసు అధికారులు అతడిని అదుపులో తీసుకుని స్టేషన్ తరలించారు. గతంలో కూడా ఆ ఉపాధ్యాయుడు.. పలువురు విద్యార్థినుల పట్ల ఇదే విధంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.