Sathya Sai Sri Ramireddy Drinking Water Scheme Workers Strike : పెండింగ్ వేతనాలు చెల్లించాలని సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల ధర్నా..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 8:28 PM IST

thumbnail

Sathya Sai,Sri Ramireddy Drinking Water Scheme Workers Strike : అనంతపురం జిల్లా ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు. ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉరవకొండ టవర్ క్లాక్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి పథకం కార్మికుల గౌరవాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ.. జిల్లాలో దాహార్తిని తీరుస్తున్నటువంటి తాగునీటి పథకంలో గత 20 ఏళ్లుగా 1500 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడానికి కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐదారు నెలల వేతనాలను పెండింగ్ పెట్టడంతో కార్మికులు ఎలా బతికేది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్​కు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదంటే  ప్రభుత్వం తక్షణమే బకాయిలను చెల్లించాలని కోరుతున్నామని కార్మికులు అన్నారు. బకాయిలు చెల్లించేంతవరకు పనిలోకి వెళ్లేది లేదని కార్మికులు తీర్మానం చేశారని తెలిపారు. వేలకోట్లు ఇస్తామనేటువంటి ముఖ్యమంత్రి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. 16 గ్రామాలకు తాగునీరు సరఫరా ఆగిపోతే కూడా ప్రభుత్వానికి స్పందన లేదన్నారు. వెంటనే కార్మికులకు పెండింగ్ ఉన్న వేతనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.