Sarpanch Questioned MLA in Gadapa Gadapaku నాకు సమాచారం ఇవ్వకుండ గడపగడపకు ఎలా నిర్వహిస్తారు..! సర్పంచ్ ప్రశ్నలతో అవాక్కైన ఎమ్మెల్యే - Protest against MLAs in Gadapa Gadapaku program

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 6:30 PM IST

Sarpanch Questioned MLA in Gadapa Gadapaku Program: కాకినాడ జిల్లా U.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే దొరబాబుపై సర్పంచ్ సత్య శ్రీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. గ్రామంలో గడపగడప కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే దొరబాబును సర్పంచ్ ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన 134 మంది లబ్ధిదారులకు ఎందుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ఆమె ఎమ్మెల్యేను నిలదీశారు.  గ్రామ సమస్యలు పట్టించుకోకుండా గడపగడపకు వెళ్లడం వల్ల ఏం ఉపయోగమన్నారు. సర్పంచ్ చెక్ పవర్ కూడా రద్దు చేయించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయని సత్య శ్రీ ఆరోపించారు.స్థానిక పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సర్పంచ్ మాట్లాడి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దొరబాబు గెలుపు కోసం తాను తన తండ్రి నూకరాజు ఎంతో కృషి చేశామని అన్నారు. అలాంటిది పలువురు స్థానిక నాయకులు మాట విని ఎమ్మెల్యే మమ్మల్ని దూరం పెట్టారని వాపోయారు.  మా గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని సర్పంచ్ సత్య శ్రీ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.