జర్మనీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - సంక్రాంతి సంబరాలు
🎬 Watch Now: Feature Video
Sankranti Celebrations At Germany : పండుగ వేళ సొంత దేశానికి రాలేని ప్రవాసాంధ్రులందరూ ఒకచోట చేరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు జర్మనీలో స్థిరపడ్డారు. వారిలో కర్నూలు వాసులూ ఉన్నారు. డస్సెల్ డార్ఫ్ నగరంలో సుమారు 400 మంది అతిథులతో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 20కిపైగా సాంస్కృతిక కార్యక్రమాలు కనులవిందుగా సాగాయి. చిన్నారులు వేషధారణలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆటపాటలు, భరతనాట్యం, నాటికలు ప్రదర్శించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, సావిత్రి తదితర నటీనటుల చిత్రాలలోని సన్నివేశాలు నటించి అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST