Viral Video లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. క్యాబిన్‌లోకి ఎక్కి దాడి చేసిన ఆర్టీవో సిబ్బంది - Lorry driver rash driving in andhrapradesh
🎬 Watch Now: Feature Video
Viral Video: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ సిబ్బంది దాడి చేయగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే 44వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపగా ఓ ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రయాణికుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లారీని వెంబడిస్తూ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఆర్మూరు ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద సిబ్బంది లారీని ఆపారు. ఆర్టీవో సిబ్బందితోనూ అతడు దురుసుగా ప్రవర్తించడంతో లారీ క్యాబిన్‌లోకి వెళ్లి దాడి చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దాడి చేయటం సరికాదన్న డీటీసీ వెంకటరమణ ఎంవీఐ సత్యమూర్తి, కానిస్టేబుళ్లు ప్రసాద్, భాస్కర్లను ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి రవాణా శాఖ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు.
ఇవీ చదవండి: