ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టిన టెంపో - గాయపడిన యాత్రికులు - తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 4:04 PM IST
|Updated : Dec 25, 2023, 5:46 PM IST
Road Accident in Tirupati District : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కొంత మందికి కాళ్లు, చేతులు విరిగాయి. ఏలూరు జిల్లా భీమడోలు నుంచి అరుణాచలం వరకు తీర్థయాత్రకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రుడు తెలిపాడు.
Tempo Hit the Tractor : ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించ బోయి ట్రాక్టర్ను టెంపో వాహనం ఢీకొంది అని క్షతగాత్రుడు తెలియజేశాడు. ఈ ప్రమాదం వల్ల టెంపో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ పంట పొలాలోకి దూసుకువెళ్లింది. స్థానికులు క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు.