పనులకు వెళ్లిన సమయంలో పేదల ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
🎬 Watch Now: Feature Video
Revenue Officials Demolished Poor People Sheds in Porumamilla : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల జీసీ కాలనీలో ఉన్న పేదవారి రేకుల షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతంలో సుమారు 12ఏళ్లుగా 33 కుటుంబాలు రేకుల షెడ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వారంతా కూలీ పనులకు వెళ్లిన సమయంలో రెవెన్యూ అధికారులు వచ్చి జేసీబీతో అన్యాయంగా కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క షెడ్డు నిర్మించడానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందని వాపోతున్నారు.
Revenue Officials Collapse GC Colony Houses in YSR District : వైసీపీ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పడం తప్ప.. ఆచరణ ఏ మాత్రం లేదని సీపీఎం నేత భైరవ ప్రసాద్ మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి పేదవారికి పరిహారం చెల్లించి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నెండు సంవత్సరాలుగా ఇళ్లకు పట్టాలు, డోర్ నెంబర్, కరెంటు మీటరు ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని భైరవ ప్రసాద్ అన్నారు. నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు.