ETV Bharat / state

'వైఎస్సార్​సీపీ నేతల అండతో భూములు కబ్జాచేసి మాపై దాడులు చేసారు' - TDP OFFICE GRIEVANCE

వైఎస్సార్స్​సీపీ ప్రభుత్వంలో నష్టపోయాం మీరే ఆదుకోవాలి - మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు

tdp_office_grievance
tdp_office_grievance (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 10:41 PM IST

People Complain to TDP Leaders: వైఎస్సార్​సీపీ సర్కారు హయాంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అక్కిస బాలకృష్ణ, కంగల వెంకటేశ్వరరావు, కత్తుల సోమిరెడ్డి, చెదల అబ్బాయిరెడ్డి తమ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. వాటిలో రిసార్టును నిర్మించారని ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారం అండతో అక్రమ కేసులు పెట్టి, తమపై దాడులు చేశారని వాపోయారు. తమకు అండగా నిలిచిన శ్రీదేవి అనే గిరిజన మహిళపై అమానుషంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు.

దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో మమ్మల్నే మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం మద్దులూరుకు చెందిన పలువురు గిరిజనులు వాపోయారు. వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముస్తక్‌ అహ్మద్, లిడ్‌ క్యాప్‌ ఛైర్మన్‌ పిల్లి మాణిక్యరావు అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై స్పందించిన నేతలు సంబంధిత అధికారులకు బాధితుల సమస్యలను తీర్చాలని ఆదేశించారు. మరి కొంతమందికి ఫోన్లు చేసి మాట్లాడారు.

ఇసుకపై ఫిర్యాదులొస్తే సహించం - ప్రజల నుంచి సూచనలు స్వీకరణ: చంద్రబాబు

  • మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ తన క్లాస్‌మేట్‌ అని చెప్పి ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి రమణశ్రీ విద్యాశాఖలో అవినీతికి పాల్పడ్డారని ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని విశ్రాంత ఎంఈవో సత్యప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.
  • మహా సిమెంట్‌ ఫ్యాక్టరీలో క్యాంటీన్, బియ్యం సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తానని నరేష్‌ అనే వ్యక్తి రూ.1.2 కోట్లు వసూలు చేశారని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రికి చెందిన యర్రంనేని నందయ్య వాపోయారు. కాంట్రాక్టు ఇవ్వకపోగా, తిరిగి డబ్బులూ చెల్లించడంలేదని ఫిర్యాదు చేశారు.
  • వారసత్వంగా వచ్చిన ఆస్తిని నా కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్‌ చేస్తానని కొవ్వూరు సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్‌ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఏలూరుకు చెందిన నరసరాజు ఫిర్యాదు చేశారు.
  • షేక్‌ సాయి అనే వ్యక్తి 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని, తిరిగి తమనే బెదిరిస్తున్నాడని సత్యసాయి జిల్లా గార్లపెంటకు చెందిన చిలకల అమ్మాజీ వాపోయారు. అతని నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • తన ఇంటిని సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిరుమలయ్యగారిపల్లెకు చెందిన చేని లక్ష్మమ్మ వాపోయారు.
  • బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పరిధిలో ఉన్న భూములను వాన్‌పిక్‌ సంస్థ తీసుకోకపోయినా ఆ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారని దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు వాపోయారు. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.

గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్​ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత

పీడీఎఫ్​ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.