Rape attempt on deaf and dum sisters సత్యసాయి జిల్లాలో దారుణం.. మూగ, చెవిటి అక్కాచెల్లెల్లపై అత్యాచారయత్నం! - Attempted to Rape
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2023/640-480-19416996-thumbnail-16x9-rape-attempt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 8:32 PM IST
Two Young Mans Attempted to Rape in Sathyasai District: మూగ వారని కూడా చూడకుండా ఇద్దరు మూగ, చెవిటి అక్కాచెల్లెల్లపై ఇద్దరు కామాందులు కన్నేశారు. మానవత్వాన్ని మంట కలిపి దారుణానికి ఒడిగట్టగా.. ఆ యువతులు ప్రతిఘటించటంతో పోలీసుల చేతికి చిక్కారు. ఆ యువతుల సోదరి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు పట్టుకతోనే.. మూగ, చెవిటి వారు. అయితే వీరిపై అదే ప్రాంతానికి చెందిన ఆంజనేయులు, శ్రీరాములు అనే ఇద్దరు యువకులు ఈ మూగ యువతులపై కన్నేశారు. ఆ యువతులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. ఆ దుండగులు మద్యం మత్తులో తూలుతూ ఇంట్లోకి చొరబడటం ఆ యువతుల సోదరుడు చూసి గట్టిగా కేకలు వేశాడు. అరుపులకు చుట్టు పక్కల వారు గమనించి.. అక్కడికి చేరుకోవటంలో ఆ దుండగులు పారిపోయారు. దీంతో ఆ యువతుల సోదరి ఈ అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.