రామ మందిర ఆహ్వానాన్ని అందుకున్న చేనేత వ్యాపారి
🎬 Watch Now: Feature Video
Ram Mandir Invitation Recieved By Handloom Business Man: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానం, ధర్మవరం పట్టుచీరల వ్యాపారికి అందింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత వ్యాపారి జింకా రామాంజనేయులకు చేనేత వ్యాపారం చేస్తుంటారు. రామ మందిరం నిర్మాణానికి ఇదివరకే రామాంజనేయులు రూ. 25 లక్షలు విరాళం ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పులిచర్ల వేణుగోపాల్, ఆర్ఎస్ఎస్ (RSS) ప్రతినిధులు శనివారం రామాంజనేయులుకు అందజేశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడం పట్ల రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు.
జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని మోదీ సూచించారు. జనవరి 23 తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావొచ్చని తెలిపారు.