GVL comments on the Margadarshi: మార్గదర్శిపై కక్ష సాధింపు సరికాదు.. కేసులు కోర్టుల్లో నిలబడలేవు : జీవీఎల్ - రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 18, 2023, 5:29 PM IST

 GVL comments on the Margadarshi: తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టంగా మార్గదర్శి సంస్థ వివరణ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం మంచిది కాదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. తమకు రాజకీయంగా అనుకూలంగా లేరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కక్ష వ్యవహరిస్తున్నట్లు అందరికీ అర్థమవుతోందని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమ వద్ద ఉన్న సంస్థలను వినియోగించి నమోదు చేస్తోన్న కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని ఆయన తెలిపారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వారి సంస్థలపై దురుద్దేశంతో వ్యవహరించడం తగదని హితవు పలికారు. చాలా మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా అనేక కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా తాను పరిగణనలోకి తీసుకోలేదని ఈ సందర్భంగా జీవీఎల్ ఉటంకించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, వాస్తవాలు వెగటుపుట్టించేలా ఉన్నా.. అంతా బాగుందనేలా ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రికి సిగ్గుగా అనిపించడం లేదా జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని, ఇటీవల విశాఖ, బాపట్లలో జరిగిన ఘటనలు అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.