బ్రిడ్జ్‌పై పనులు చేస్తుండగా సడెన్‌గా వచ్చిన రైలు.. నదిలోకి దూకిన కార్మికుడు.. ఆ తర్వాత..
🎬 Watch Now: Feature Video
Railway Worker Jumped From Bridge To River : బిహార్‌లోని ఓ రైల్వే బ్రిడ్జ్‌పై నుంచి నదిలోకి దూకాడు ఓ కార్మికుడు. పట్టాలపై పనులు చేస్తుండగా ఒక్కసారిగా రైలు రావడం వల్ల.. చేసేదేం లేక బాగ్మతీ నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సహర్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కార్మికుడు నదిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అప్రమత్తమై అతడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఓ తాడు సహాయంతో కార్మికుడ్ని బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని అశోక్ కుమార్‌గా గుర్తించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కార్మికుడి కాలుకు చిన్న గాయం అయినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ ఓ ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నట్లు తెలిసింది. కానీ కాంట్రాక్టర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని రైల్వే ఇన్స్‌స్పెక్టర్ వందన కుమారి తెలిపారు