Rahul Gandhi Dance Video : ఊటీలో రాహుల్ సందడి.. గిరిజనులతో కలిసి డ్యాన్స్.. వీడియో చూశారా? - రాహుల్ గాంధీ ఊటీ పర్యటన
🎬 Watch Now: Feature Video
Rahul Gandhi Dance Video In Tamilnadu : రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడులోని ఊటీకి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి తోడా గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. వారు పాటలు ఆలపిస్తుండగా రాహుల్ కూడా వారిని అనుసరించారు. తోడా గిరిజనుల లానే వారి సంప్రదాయ దుస్తులు ధరించి రాహుల్ ఆడిపాడారు. ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో తోడా గిరిజన సంఘంతో రాహుల్ భేటీ అయ్యారు.వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Rahul Gandhi Europe Trip : రాహుల్ గాంధీ శనివారం ఉదయం కొయంబత్తూర్ చేరుకున్నారు. అనంతరం కేరళలోని తమ పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటించారు. రాహుల్ గాంధీ ఎంపీ స్టేటస్‌ను లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించిన తర్వాత.. రాహుల్ తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. అయితే, రాహుల్ గాంధీ సెప్టెంబర్‌లో ఐరోపా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన యురోపియన్ యూనియన్- ఈయూ పార్లమెంట్ సభ్యలు, ప్రవాస భారతీయులతో సమావేశమవ్వనున్నట్లు సమాచారం..