బాలికను వేధించిన కేసులో ప్రాసిక్యూటర్లకు 2 వారాల రిమాండ్ - మూడో వ్యక్తి కోసం గాలింపు - AP Crime News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 12:37 PM IST
Public Prosecutors Remanded for Two Weeks in Girl Abuse Case: అనంతపురంలో మైనర్ బాలికను చిత్రహింసలు పెట్టిన కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దంపతులైన వసంత లక్ష్మిబాయి, రమేష్‌కు పొక్సో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ ధరణి కిషోర్ తెలిపారు. ఈ కేసులో శేఖర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాలిక వాంగ్మూలం మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి బాలికను ఆసుపత్రిలో చేర్చిన వసంత లక్ష్మి తండ్రి రంగస్వామికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. బాలిక పరిస్థితి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రిలో చేర్చిన అంశంపై ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం బాధ్యులను నలుగురుగా చేర్చి ముగ్గురిపై కేసు నమోదు చేశామని తెలిరాకు.
ఇప్పటికే ఇద్దరిని రిమాండ్‌కి పంపగా.. మరో వ్యక్తిని పంపాల్సి ఉందన్నారు. శేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ పరామర్శించారు. అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. బాలికకు చదువుతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని వారు తెలిపారు.
TAGGED:
మైనర్ బాలికను చిత్రహింసలు